గుంటూరులో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను

4చూసినవారు
గుంటూరులో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను
గుంటూరు జిల్లా, పెదకాకానిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవకే అంకితమయ్యే అభ్యర్థులను ఎన్నుకోవాలని ఆయన కోరారు. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన గొప్ప హక్కు అని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం పొన్నూరు నియోజకవర్గ పరిధిలో జరిగింది.

సంబంధిత పోస్ట్