స్వచ్ఛ గ్రామ పంచాయతీగా సీతారామపురం

8చూసినవారు
స్వచ్ఛ గ్రామ పంచాయతీగా సీతారామపురం
స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌–2026లో పొన్నూరు మండలం నుంచి సీతారామపురం గ్రామ పంచాయతీ స్వచ్ఛ గ్రామ పంచాయతీ పురస్కారానికి ఎంపికైంది. సెప్టెంబరు 21న ఐఎస్ఓ సర్టిఫికెట్‌ సాధించిన గ్రామం ఆరోగ్యకర గ్రామంగా జాతీయ పంచాయతీరాజ్‌ అవార్డుకు నామినేట్‌ అయింది. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి కేవీవీ సత్యనారాయణ అధికారులను, గ్రామస్థులను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గుమ్మా చంద్రశేఖరరావు, పంచాయతీ ప్రత్యేక అధికారి డా. ఎన్‌. ఉషారాణి, పీడీవో నిరంజన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్