గుంటూరు, పొన్నూరులో వివిఐటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ వెర్నపు కిరణ్ కుమార్ కేఎల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా సోమవారం పొందారు. రెండువైపులా ఫ్రిక్షన్ స్టిర్ వెల్డింగ్ చేసిన AA7075 అల్యూమినియం మిశ్రమలోహం యాంత్రిక, తుప్పు నిరోధక ధర్మాలపై చేసిన పరిశోధనకు ఈ పట్టా లభించింది. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ను వీసీ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, రిజిస్ట్రార్ డాక్టర్ వై. మల్లికార్జున రెడ్డి తదితరులు అభినందించారు.