గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో పదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్న సంబంధిత వ్యక్తులపై ఎస్సీ మహిళా కమిషన్ కు బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ చైల్డ్ రైట్స్ అధికారుల బృందం బుధవారం బాధిత కుటుంబ సభ్యులను కలిసి వివరాలను సేకరించి బాధిత మహిళకు ధైర్యం చెప్పారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.