పెదకాకానిలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

4చూసినవారు
పెదకాకానిలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు
పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని సెంటర్లో బుధవారం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పేదల పెన్నిధి, రైతు బాంధవుడు, జలయజ్ఞ ప్రదాత, వ్యవసాయాన్ని పండుగగా మార్చిన రైతు నేస్తం అని, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు పరితపించిన మహా నేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్