ప్రత్తిపాడులో దంచి కొట్టిన భారీ వర్షం

1431చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో బుధవారం భారీ వర్షం కురిసింది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, బుధవారం మధ్యాహ్నం అర్ధగంట పాటు కురిసిన భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. దీనితో గుంటూరు-పర్చూరు ప్రధాన రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.