కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద శుక్రవారం ఫ్లైఓవర్ పై నుంచి తారు ట్యాంకర్తో వెళుతున్న లారీ కింద పడిపోయింది. డ్రైవర్ అధికంగా మద్యం తాగి ఉండడం వలనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ట్రాఫిక్ను మళ్లించి, డ్రైవర్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని తెలిపారు.