శుక్రవారం చెరుకుపల్లిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గుళ్లపల్లిలోని బోర్లమ్మ డొంకలో రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి, అనుమానం ఉన్న ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 29 వాహనాలను సీజ్ చేశారు. ఈ తనిఖీలలో రేపల్లె రూరల్ సీఐ సురేశ్ బాబు, చుండూరు సీఐ ఆనందరావు, చెరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్ పాల్గొన్నారు.