భట్టిప్రోలు: చేపల పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి

172చూసినవారు
భట్టిప్రోలు: చేపల పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి
సూరేపల్లి డ్రైన్‌లో పడి ఒడుగు గోపాలరావు (55) అనే వ్యక్తి మృతి చెందినట్లు కానిస్టేబుల్ కృష్ణ తెలిపారు. గురువారం చేపలు పట్టేందుకు వెళ్లి తిరిగి రాని గోపాలరావు, శుక్రవారం ఉదయం డ్రైన్‌లో శవమై కనిపించారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణించినట్లు భావిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.