రైల్వే పట్టాల పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

1056చూసినవారు
రైల్వే పట్టాల పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
చిన్నగంజాం - వేటపాలెం రైల్వే స్టేషన్ల మధ్య పట్టాల పక్కన శనివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గ్యాంగ్ మెన్ గుర్తించారు. రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో, ఎస్ఐ కొండయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం కోసం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైలులో ప్రయాణిస్తూ నిద్రమత్తులో బోగి నుండి కింద పడి మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్