చెరుకుపల్లి మండలంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. దక్షిణ కోస్తా రాయలసీమ మీదుగా ద్రోణి విస్తరించడంతో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ వర్షాల కారణంగా వ్యాపారస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.