రేపల్లెలో సి ఐ టి యు జిల్లా మహాసభలు జయప్రదం చేయండి

1646చూసినవారు
ఈ నెల 27, 28 తేదీలలో రేపల్లెలో జరగనున్న సీఐటియు బాపట్ల జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణి లాల్ పిలుపునిచ్చారు. బుధవారం నిజాంపట్నం మండలంలోని వివిధ గ్రామాల్లో ఆటో, ముఠా, అంగన్వాడి, ఆశ, ఐకెపి కార్యకర్తలను కలిసి మహాసభలకు హాజరుకావాలని కోరారు. కార్మిక సమస్యలపై పోరాడే సీఐటియు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించే ఈ మహాసభల్లో జిల్లావ్యాప్తంగా కార్మికులు పాల్గొనాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్