చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సోమవారం జాతీయ క్యాడేట్ దళం (ఎన్ సి సి) యూనిట్ ను ఘనంగా ప్రారంభించారు. కల్నల్ ఉదయ్ కుమార్, లెఫ్టినెంట్ కల్నల్ మహేష్ ఈ యూనిట్ ను అధికారికంగా ప్రకటించారు. దేశ సేవ వంటి విలువలు ఎన్సిసి ద్వారా విద్యార్థులలో బలపడతాయని ప్రిన్సిపల్ సుభాష్ చంద్రబోస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శివప్రసాద్ తెలిపారు.