రేపల్లె సిపిఎం కార్యాలయంలో బుధవారం పీపీపీ విధానాన్ని ఖండిస్తూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ రేపల్లె ఇంచార్జ్ దోవా రమేష్ రాంజీ మాట్లాడుతూ, పేద వర్గాలకు వైద్య విద్యను దూరం చేయాలని చూస్తున్న ప్రభుత్వ దుర్మార్గపు చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాలని, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.