డిగ్రీ కాలేజీ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన

1089చూసినవారు
రేపల్లె ఏబీఆర్ డిగ్రీ కాలేజీలో విద్యార్థిని సస్పెండ్ చేయడంతో మనోవేదనతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరించి, ప్రిన్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థిని తరగతులకు రానివ్వకుండా వేధింపులకు పాల్పడుతున్నారని, కాలేజీ ఆవరణంలో పురుగుల మందుతో ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థికి న్యాయం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థినికి తిరిగి అడ్మిషన్ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

సంబంధిత పోస్ట్