బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ బుధవారం రాత్రి చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి, రిసెప్షన్ లో అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు తక్షణ న్యాయం అందించాలని సూచించారు. జిల్లాలో నేరాల నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇస్తానని ఎస్పీ తెలిపారు. ఈ తనిఖీలో రేపల్లె డిఎస్పి శ్రీనివాసరావు, రూరల్ సీఐ సురేష్ బాబు, ఎస్ఐ అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.