పిపిపి విధానాన్ని రద్దు చేయాలి

900చూసినవారు
చెరుకుపల్లిలో మంగళవారం వైసిపి ఎస్టీ సెల్ రాష్ట్ర మాజీ కార్యదర్శి చౌటూరి రమేష్ మాట్లాడుతూ, విద్య, వైద్యం ప్రభుత్వ నియంత్రణలో ఉంటేనే పేద ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో వై.యస్. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే, కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమని విమర్శించారు. కరోనా సమయంలో ప్రభుత్వ వైద్యమే ప్రజలను కాపాడిందని, కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్