చెరుకుపల్లిలో వైసిపి జాయింట్ సెక్రెటరీ బాలాజీ అభినందన సభ

1589చూసినవారు
రేపల్లె వైసిపి సమన్వయకర్త డాక్టర్ గణేష్ కూటమి ప్రభుత్వం ప్రజలకు సుస్థిర పాలన అందించడంలో విఫలమైందని విమర్శించారు. గురువారం రాత్రి చెరుకుపల్లిలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, వైసిపి నాయకుడు చిమట బాలాజీని వైసిపి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించిన సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రేపల్లె నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ పార్టీ ఆవిర్భావం నుండి వైసిపిలో క్రియాశీలకంగా పనిచేస్తూ వైఎస్ జగన్ సన్నిహితుడిగా పేరుపొందాడని డాక్టర్ గణేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్