
రేపల్లె: సీడీపీఓ సుచిత్ర కు రాష్ట్ర స్థాయి గౌరవం
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో శనివారం రేపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ ఎం. సుచిత్రను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్కరించి, ప్రశంస పత్రం అందించారు. సైక్లోన్ సమయంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లల భద్రత కోసం ఆమె చూపిన అంకితభావం, సమన్వయం, నాయకత్వానికి గాను ఈ పురస్కారం లభించింది.






































