
రేపల్లె: పుస్తక పఠనంతో విజ్ఞానం తహసిల్దార్
రేపల్లె పట్టణంలో శనివారం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శాఖా గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసిల్దార్ మోర్ల శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ కే. సాంబశివరావు పాల్గొని ప్రారంభించారు. గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీతో కలిసి గ్రంథాలయ అభివృద్ధిని మెరుగుపరచడంపై సూచనలు చేశారు. గ్రంథ పఠనం విజ్ఞానానికి తొలిమెట్టని, ప్రతి ఒక్కరూ గ్రంథ పఠనం చేయాలని కోరారు.






































