
పొట్టి శ్రీరాములు విగ్రహం: శిల్పులకు ప్రశంసలు
తెనాలికి చెందిన ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అత్యద్భుతంగా రూపొందించారు. ఈ నెల 16న పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా 2 టన్నుల ఐరన్ స్క్రాప్ తో తయారు చేసిన విగ్రహాన్ని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనగా ఉంచారు. గుంటూరు, తెనాలిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంద్రకీలాద్రి పాలక మండలి సభ్యులు తోటకూర రమణారావు, బీసీ సంఘ అధ్యక్షుడు కేసన శంకరరావు విగ్రహాన్ని తిలకించి శిల్పులను అభినందించారు.
































