
జాతీయస్థాయి థాంగ్ - టా పోటీలకు సెయింట్ థామస్ విద్యార్థులు
పొన్నూరులోని సెయింట్ థామస్ కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు కొత్తపల్లి భాను ప్రణతి, అభయ్ సింగ్ ఢిల్లీలో ఫిబ్రవరి 30 నుండి ఫిబ్రవరి 3 వరకు జరిగే జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 బాల బాలికల విభాగంలో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. అనకాపల్లి జిల్లా పరవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ థాంగ్ - టా మార్షల్ ఆర్ట్స్ పోటీలలో వీరు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రోజ్ థామస్ బుధవారం తెలిపారు.






























