సత్తెనపల్లి - Sattenapalle

పెద్దకూరపాడు తెలుగు యువత సెక్రెటరీగా కుంభా గోపి నియామకం

పెద్దకూరపాడు తెలుగు యువత సెక్రెటరీగా కుంభా గోపి నియామకం

పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగు యువత సెక్రెటరీగా కుంభా గోపిని నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నియామకంపై కుంభా గోపి మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని, నియోజకవర్గంలో యువతను సంఘటితం చేసి పార్టీ సిద్ధాంతాలను బలపరచడంలో కృషి చేస్తానని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకుగా పాల్గొంటానని తెలిపారు. శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, నాయకులు కోట అనిల్, ఏపూరి లక్ష్మీనారాయణలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

వీడియోలు


పెద్దపల్లి జిల్లా