
శైవక్షేత్రం వద్ద అనధికారిక వసూళ్లు.. భక్తుల మండిపాటు
తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం శైవక్షేత్రం వద్ద అనధికారికంగా పార్కింగ్ వసూళ్లపై ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులు ద్విచక్ర వాహనాలకు రూ. 20, కార్లు, ఆటోలకు రూ. 40 చొప్పున వసూలు చేస్తున్నారని, ప్రశ్నిస్తే అన్నదానానికి వెళ్తుందని చెబుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.


































