గుంటూరు జిల్లా తాడికొండ మండలం తుళ్లూరు గ్రామంలో బుధవారం హై స్కూల్ రోడ్లో అమరావతి నుండి విజయవాడ వెళ్తున్న AP 16z0473 ఆర్టీసీ బస్సు ముందు టైరు పగిలింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బస్సును సురక్షితంగా పక్కకు నిలిపి, టైరును మార్చారు. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఆర్టీసీ డ్రైవర్ తెలిపారు. రాజధాని నగరంలో నిర్మాణంలో ఉన్న రోడ్లు, గుంతల వల్ల టైర్లు త్వరగా పాడవుతున్నాయని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.