ట్రాఫిక్ కష్టాలు.. లారీల ఇష్టారాజ్యం

6చూసినవారు
ట్రాఫిక్ కష్టాలు.. లారీల ఇష్టారాజ్యం
తుళ్లూరు మండలం తుళ్లూరు గ్రామంలో ప్రధాన కూడలి వద్ద రహదారుల వెంట లారీలు ఇష్టారాజ్యంగా తిరగడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల సమయాల్లో వీటి సంచారం ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. లారీలు అధిక వేగంతో, శబ్దంతో వెళ్లడం వల్ల రోడ్లపై దుమ్ము లేచి, దుమ్ము అలర్జీతో నివాస ప్రజలు బాధపడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్