
తుళ్లూరు: కృష్ణానదిలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంతు
తుళ్ళూరు మండలం, రాయపూడి గ్రామం వద్ద కృష్ణా నది లాంచ్ రేవులో ఆదివారం సాయంత్రం జరిగిన ఘటనలో, శాఖమూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న నలుగురు కార్మికులు నదిలో స్నానానికి దిగగా, ప్రమాదవశాత్తు ఇద్దరు కొట్టుకుపోయారు. సమాచారం అందిన వెంటనే తుళ్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.





































