
తాడికొండ: అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా
తాడికొండలో అక్కదేవత చెరువు కట్టపై అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పంచాయతీ అధికారులు ఆదివారం ఉదయం నోటీసులు జారీ చేసి, నిర్మాణాలను తొలగించే పనులు చేపట్టారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున, పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించి కూల్చివేత పనులను పర్యవేక్షిస్తున్నారు.




































