
తెనాలి: తక్కువ డ్యామేజ్ జరిగే లాగా చూడండి – ఎమ్మెల్సీ
తెనాలిలో మాస్టర్ ప్లాన్‌పై మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర మాట్లాడుతూ, మాస్టర్ ప్లాన్‌లో చూపిన ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల ఏర్పాటుకు ప్రతిబంధకాలు ఉంటాయని, దీనిపై మరో సమావేశంలో క్షుణ్ణంగా చర్చించాలని సూచించారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తక్కువ నష్టం జరిగేలా చూడాలని ఆయన కోరారు.
































