గృహ హింస కేసు నమోదు

3472చూసినవారు
గృహ హింస కేసు నమోదు
కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన సింధుప్రియకు మే 9న అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్‌తో వివాహం జరిగింది. వివాహ సమయంలో వరకట్నం డిమాండ్ చేసి, ఆ తర్వాత అదనపు కట్నం కోసం సింధుప్రియను భర్త, అతని తల్లిదండ్రులు, పెద్దమ్మ, పెదనాన్నలు శారీరకంగా, మానసికంగా హింసించినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. భర్త శ్రీకాంత్ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని, సింధుప్రియను అసభ్యకరంగా తిడుతూ, కొడుతున్నట్లుగా ఆమె ఇచ్చిన నివేదిక మేరకు కొల్లిపర SI కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్