తెనాలిలో బాలికపై లైంగిక వేధింపులు.. వృద్ధుడిపై పోక్సో కేసు

18చూసినవారు
తెనాలిలో బాలికపై లైంగిక వేధింపులు.. వృద్ధుడిపై పోక్సో కేసు
తెనాలి పట్టణంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై వెంకటరమణ(60) అనే వృద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చాక్లెట్లు, పానీపూరీ ఇప్పిస్తానని ఆశచూపి బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్