తెనాలిలో యడ్ల లింగయ్య కాలనీలో తేజ (26) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన తేజ తెనాలికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకుని నాలుగేళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం. కొడుకు మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.