
ఆరుగురు స్క్రబ్ టైపస్ బాధితులు డిశ్చార్జ్
తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో స్క్రబ్ టైపస్తో చికిత్స పొందుతున్న బాధితులు కోలుకుంటున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌభాగ్య వాణి తెలిపారు. ఇటీవల వివిధ ప్రాంతాలకు చెందిన 11 మందికి పరీక్షలు నిర్వహించగా స్క్రబ్ టైపస్గా నిర్ధారించి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆరుగురు డిశ్చార్జ్ కాగా, ఐదుగురు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు.








































