ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

854చూసినవారు
వేమూరు శాసన సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు జన్మదినం సందర్భంగా ఈ నెల 10వ తేదీన మంగళవారం అమర్తలూరులో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అమర్తలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కాటూరి మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ సహకారంతో జరిగిన ఈ శిబిరంలో మల్టీ స్పెషాల్టీ వైద్య సేవలు అందించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నక్కా ఆనందబాబు కుమారుడు నక్కా ఆకాష్, తహసిల్దార్ నెహ్రూ బాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్