కొల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మంత్రి సత్య ప్రసాద్, కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే ఆనందబాబు, ఎస్పీ ఉమామహేశ్వర్ లు అధికారులతో వరద ముప్పుపై సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో గ్రామాలు ముంపునకు గురికాకుండా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహాయ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.