బాపట్ల జిల్లా చుండూరు మండలం వలివేరు గ్రామంలో రైల్వే ట్రాక్ సమీపంలోని పొలాల్లో మంగళవారం ఒక గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని రైతులు గుర్తించారు. ఈ ఘటనపై చుండూరు పోలీసులకు సమాచారం అందడంతో, వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు సుమారు 5 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు చుండూరు పోలీసులను ఎస్సై 9440796179, సీఐ 9440796255 నంబర్లలో సంప్రదించాలని కోరారు.