
గుంటూరు: ప్రియుడితో కలిసి భర్త నాగరాజుపై దాడి చేసిన భార్య
గుంటూరులోని కృష్ణనగర్ పార్క్ వద్ద ఓ వివాహిత, తన ప్రియుడితో కలిసి భర్త నాగరాజుపై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం కారణంగా భార్య దూరంగా ఉంటూ, తనను హత్యకు శ్రమించినట్లు నాగరాజు ఆరోపించాడు. దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించాడు. సంఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు బయటపడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

































