చివరి దశలో బీసీ జనాభా లెక్కింపు ప్రక్రియ.. త్వరలో స్థానిక ఎన్నికలు

9చూసినవారు
చివరి దశలో బీసీ జనాభా లెక్కింపు ప్రక్రియ.. త్వరలో స్థానిక ఎన్నికలు
AP: రాష్ట్రంలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికలను త్వరగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని హైకోర్టుకు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకాన్ని వారం రోజుల్లో చేపట్టి, రాష్ట్ర ప్రణాళికశాఖ చేపట్టిన బీసీ జనాభా లెక్కింపు చివరి దశకు చేరిందని నివేదించారు. మరో పది రోజుల్లో జనాభా లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుందన్నారు. గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు ఇప్పటికే బాధ్యతలు తీసుకున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్