చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు పొడిచారు: బొత్స సత్యనారాయణ

7692చూసినవారు
చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు పొడిచారు: బొత్స సత్యనారాయణ
AP: CM చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు పొడిచారని, మోసం చేయడం ఆయనకు అలవాటేనని ధ్వజమెత్తారు. బీసీలకు రాజకీయంగా అండగా నిలిచింది వైసీపీనేనని స్పష్టం చేశారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని, బీసీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్