మరో 48 గంటలు జాగ్రత్త: మంత్రి నారా లోకేశ్

40237చూసినవారు
మరో 48 గంటలు జాగ్రత్త: మంత్రి నారా లోకేశ్
AP: మొంథా తుఫాన్ నేపథ్యంలో రాబోయే 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గృహాలు, వాణిజ్య సముదాయాలకు 100% విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలన్నారు. భారీ వర్షాల వల్ల రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించడానికి అగ్నిమాపక శాఖ సహాయం తీసుకోవాలని సూచించారు. తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్