తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ముఖ్యంగా తాగే నీరు సులభంగా కలుషితమవుతుంది. ఫిల్టర్ నీళ్లు తాగినా, వాటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. RO, UV ప్యూరిఫైయర్లు వాడినా, నీటిని 10-15 నిమిషాలు మరిగించి తాగడం మంచిది. ప్యూరిఫైయర్ క్యాండిల్స్ ను క్రమం తప్పకుండా మార్చాలి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండి, జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు.