హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారు. దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. గగనతల రక్షణ వ్యవస్థకు ఎయిర్ ఫోర్స్ కీలకమని, యుద్ధంలో సాంకేతిక వినియోగం పెరిగిందని, దానిని అధికారులు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఎయిర్‌ఫోర్స్, నేవీ, కోస్ట్‌గార్డ్ ట్రైనీలకు వింగ్స్, బ్రెవెట్స్ అందజేశారు.