AP: చిత్తూరు జిల్లా పడిపుట్లబైలులో ఏనుగుల సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఏనుగుల కదలికలపై అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. మనుషులపై దాడి చేయకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కుంకీ ఏనుగులను రంగంలోకి దించాలని స్పష్టం చేశారు.