ఛత్తీస్‌గఢ్‌లో ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లు మృతి! (వీడియో)

11992చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో బుధవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆడ ఎలుగుబంటి తన పిల్ల చనిపోయిన ఆవేదనతో ఇద్దరు అన్నాచెల్లెళ్లపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనలో మరో మహిళ తీవ్రంగా గాయపడగా, ఆమెను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల కథనం ప్రకారం, ఎలుగుబంటి పిల్ల మంగళవారం నాడు చనిపోవడంతో తల్లి ఎలుగుబంటి ఆగ్రహంతో వ్యవహరించిందని తెలుస్తోంది. అధికారులు ఎలుగుబంటిని మత్తుమందు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్