ఆదాయంలో టాప్‌ నగరాలు ఇవే!

10202చూసినవారు
ఆదాయంలో టాప్‌ నగరాలు ఇవే!
దేశంలోని నగరాల ఆదాయ, వినియోగ స్థాయిలపై తాజాగా “ప్రైస్‌‌‌‌& టాటా సన్స్ రిపోర్ట్‌‌‌‌” నివేదిక కీలక వివరాలు వెల్లడించింది. ఇందులో బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీ నగరాలు సగటు కుటుంబ ఆదాయంలో టాప్ స్థానాల్లో ఉన్నట్లు పేర్కొంది. ధనవంతుల కేంద్రాలుగా ఢిల్లీ, ముంబై, పుణె కొనసాగుతున్నాయి. ఇక మిడిల్ క్లాస్ జనాభా అత్యధికంగా ఉన్న నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. దేశంలోని టాప్ 100 నగరాలు దేశ ఆదాయం, వినియోగంలో మూడో వంతుకు పైగా వాటాను కలిగి ఉన్నట్లు నివేదిక ఈ తెలిపింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ వినియోగంలో అతిపెద్ద హబ్‌గా ఉంది. అలాగే కటిక పేదరికం టాప్ నగరాల్లో దాదాపు కనుమరుగవుతుందని నివేదిక పేర్కొంది.

సంబంధిత పోస్ట్