IPL టికెట్ల పేరుతో బెంగళూరు పోలీసుల ఏప్రిల్ ఫూల్

688చూసినవారు
IPL టికెట్ల పేరుతో బెంగళూరు పోలీసుల ఏప్రిల్ ఫూల్
ఐపీఎల్ మ్యాచ్‍ల నేపథ్యంలో బెంగళూరు పోలీసులు అభిమానులను ఆకట్టుకోవడానికి ఒక వినూత్న ప్రయత్నం చేశారు. ఉచిత ఐపీఎల్ టికెట్లు అంటూ ఒక లింక్‍ను షేర్ చేశారు. అభిమానులు ఆ లింక్‍ను క్లిక్ చేయగా, అది ఏప్రిల్ ఫూల్ అని, ఆటపట్టించామని స్క్రీన్ పై కనిపించింది. అపరిచిత లింకుల ద్వారా జరిగే సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికే ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొదట్లో అభిమానులు ఆగ్రహించినా, తర్వాత పోలీసులు చేసిన మంచి పనిని గుర్తించి అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్