డిజిటల్ అరెస్ట్ మోసాలతో జాగ్రత్త: పెమ్మసాని

6341చూసినవారు
AP: డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. పోలీసు అధికారులుగా నటిస్తూ.. సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ చేసి డబ్బులు వసూలు చేస్తారని తెలిపారు. సైబర్ నేరాలపై 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. ఈ మేరకు ఇలాంటి నేరాలపై అవగాహన కల్పించేలా ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్