తిరుమల తరహాలో.. బెజవాడ కనకదుర్గమ్మ ప్రసాదం!

6చూసినవారు
తిరుమల తరహాలో.. బెజవాడ కనకదుర్గమ్మ ప్రసాదం!
AP: ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులకు అందించే ప్రసాదం, అన్నదానంలో నాణ్యత పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈవో శీనానాయక్‌ ఆధ్వర్యంలోని బృందం తిరుమలకు వెళ్లి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం తయారీ విధానాలను పరిశీలించింది. ఆధునిక యంత్రాలు, ముడి పదార్థాల నాణ్యత, వడ్డన విధానాలపై వివరాలు సేకరించారు. తిరుమల తరహాలోనే బెజవాడ కనకదుర్గమ్మ ప్రసాదాన్ని కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్