ఎన్టీఆర్ కు భారత రత్న: చంద్రబాబు హామీ

0చూసినవారు
ఎన్టీఆర్ కు భారత రత్న: చంద్రబాబు హామీ
దిగ్గజ నటుడు, రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావుకు భారత రత్న పురస్కారం అందించాలని తెలుగు ప్రజలు ఎప్పటినుంచో ఆకాంక్షిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా ఆయనకు ఈ అత్యున్నత పురస్కారం దక్కకపోవడం తెలుగు వారికి తీరని లోటుగా మిగిలింది. ఎన్టీఆర్ తన సినీ జీవితంలో 1968లో పద్మశ్రీ మాత్రమే అందుకున్నారు. ఆయన 30వ వర్ధంతి సందర్భంగా, సీఎం చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కు భారత రత్న సాధించి పెడతామని స్పష్టం చేశారు. అందరి మనోభావాలను గౌరవిస్తూ, అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్