AP: తనను తాను పేదల పక్షపాతిగా ప్రచారం చేసుకుంటున్న అభినయ దర్శన్ తాజాగా సంచలన విషయం వెల్లడించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భరోసా పార్టీ తనది కాదని, వేరే వ్యక్తి స్థాపించారని, దీనిని జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించారని తెలిపారు. తనకున్న ఫాలోయింగ్ చూసి, ఏపీకి అధ్యక్షుడిగా ఉండాలని సూచించారని, అప్పటినుంచి తాను అధ్యక్షుడిగా కొనసాగుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.